పబ్ జి కి బానిస అవుతున్న యువత ..!

ఈ రోజుల్లో యువత మీద పబ్ జి ఆట ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ ఆటకు బానిసలు గా మారుతున్నారు. ఏ పరిస్థితిలో అయినా సరే దాన్ని వదలకుండా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఆ ఆట ఆడవద్దని తల్లి చెప్పగానే ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నై లోని తిరువొత్తియూర్‌ కాలడి పేట ప్రాంతానికి చెందిన రఘుపతి కుమార్తె విద్యశ్రీ (18) అదే ప్రాంతం లోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె… తన ఫోన్ లో పబ్ జి డౌన్లోడ్ చేసుకుంది దానికే పరిమితం అయింది. తల్లి పలుమార్లు హెచ్చరిచినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం కాలేజి నుంచి వచ్చిన వెంటనే ఆడటం గమనించిన తల్లి ఫోన్ లాక్కుని హెచ్చరించింది. మనస్థాపానికి గురైన విద్యశ్రీ రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె తన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబీకులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఫ్యాన్‌కు శవంగా వేలాడింది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయమై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *