పోలీస్ స్టేషన్ కి బేడీలు వేసిన పోలీసులు…!

షాద్ నగర్ లో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దీనితో స్టేషన్ బయట ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసారు. మహిళా సంఘాలు, విద్యార్థినులు, ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేసారు. ఇక ఆందోళనకారులు స్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై… స్టేషన్‌ గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో… బేడీలను వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *